మీ కంప్లైంట్ చూసి DGP కడుపుబ్బా నవ్వుకొని ఉంటడు.. కాంగ్రెస్ మంత్రిపై RSP సెటైర్

by Disha Web Desk 2 |
మీ కంప్లైంట్ చూసి DGP కడుపుబ్బా నవ్వుకొని ఉంటడు.. కాంగ్రెస్ మంత్రిపై RSP సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఆదివారం పోస్టు పెట్టారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఫోను సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడో వ్యక్తి లేదా సంస్థ విని రికార్డు చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటరు మంత్రి గారు. మీకు ట్యాపింగ్ బేసిక్స్ మీద కనీస అవగాహన కూడా ఉన్నట్లు లేదు. అసలు మీకు తెలియకుండా మీ ఫోను నుండి పొంగులేటి గారికి కాల్ ఎట్ల పోతది? నాకు తెలిసిన ఏ ట్యాపింగ్ టెక్నాలజీ మీ ప్రమేయం లేకుండా మీ ఫోను నుండి రెండో వ్యక్తికి కాల్ చేయదు. (వాళ్లకు ఈ ప్రాంక్ కాల్స్ అవసరం కూడా ఉండదు). మీ అవుట్గోయింగ్ కాల్ లిస్టు వెరిఫై చేసుకున్నారా? పొంగులేటి గారి ఇన్కమింగ్ లిస్టులో ఉన్నది మీ నంబరేనా? మీ స్పీడ్/ఎమర్జెన్సీ కాల్ లిస్టులో పొంగులేటి గారి నంబరున్నదేమో! అసలు మీ ఫోను ఎప్పుడూ మీ దగ్గరే ఉంటదా? మీ ఫోనుకు పాస్ కోడ్ ఉందా? ఆక్సిడెంట‌గా ఫేస్టైం(FaceTime) నొక్కారేమో మీరు? రాత్రి అన్నారు కాబట్టి నిద్ర-‘మత్తులో’ పొంగులేటి గారికి నొక్కారేమో?

ఒక వేళ మత్తులో ఉంటే మీకు తెలిసే అవకాశమే లేదు. మీకు తెలియని వ్యక్తి మీకు కాల్ చేయడమేంది? మీరు గట్టిగా అరవడమేంది? దీనికీ ట్యాపింగ్‌కు సంబంధం ఏంది? (మీ కంప్లైంట్ చూసి డీజీపీ కడుపుబ్బ నవ్వుకొని ఉంటడు. ఆ కంప్లయింట్ మాతో కూడా షేర్ చేసుకోండి ప్లీజ్). ఎందుకు సార్, సీనియర్ మంత్రైన మీరు పైనుండి వచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చదివి అభాసుపాలవుతరు? ఈ ప్రపంచంలో ట్యాపింగుకు హ్యాకింగ్‌కు అతీతమైన టెక్నాలజీ ఏదీ లేదు. స్మార్ట్ ఫోను కొని I Agree అన్న బటన్స్ నొక్కిన రోజే మన ప్రైవసీ ఆవిరైపోయింది. దయచేసి ఈ ట్యాపింగ్‌ల కామెడీని ఇక మీ అందరు బందు పెట్టి కేసీఆర్ గారి లాగా రైతన్నల దగ్గరికి వెళ్లండి. వాళ్ల కన్నీళ్లను తుడవండి. పోయిన పరువు కొంచెమన్నా దక్కుతుంది’’ అని మంత్రి జూపల్లిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర సెటైర్లు వేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed