ముందస్తు ఎన్నికలపై RS ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ముందస్తు ఎన్నికలపై RS ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంత బలం లేదని, ఒక ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీ అని ఈ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ లాంటి వారిని పట్టించుకోని పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హాజరై ఆయన మాట్లాడారు. బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులకు, సైనికులు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గొప్పగా చేసిందేమీ లేదన్నారు. కేవలం మునుగోడు ఎన్నికకు కమ్యూనిస్టుల మద్దతు, వంద మంది నాయకులు, ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితి లేదని, అలాంటిది కేంద్రంలో గెలుస్తామనుకోవడం ఊహ మాత్రమేనని పేర్కొన్నారు.

అకస్మాత్తుగా ఫాంహౌజ్ నుంచి బయటకొచ్చి, జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, మెట్రో పనులు, నూతన సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి హుటాహుటిన కార్యాచరణ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని, ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కూడా కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బట్టెంకి బాలరాజు, జిల్లా ఇంచార్జులు సురేష్ గౌడ్, గుల్లాని సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత వివిధ అసెంబ్లీ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed