పకడ్బందీగా సోషల్ మీడియా రౌండ్ ది క్లాక్ సైబర్ పెట్రోలింగ్ : పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్

by Disha Web Desk 1 |
పకడ్బందీగా సోషల్ మీడియా రౌండ్ ది క్లాక్ సైబర్ పెట్రోలింగ్ : పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్
X

దిశ, రాచకొండ : గణేష్ నవరాత్రోత్సవాలను ప్రశాతంగా నిర్వహించేందుకు రాచకొండ పరిధిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలెవరూ సోషల్ మీడియా పుకార్లకు నమ్మొద్దని స్పష్టం చేశారు. పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని, ఏవైనా అనుమానాలుంటే వారిని అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100, రాచకొండ వాట్సాప్ నెం.8712662111కు సంప్రదించవచ్చని సీపీ తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విజిబుల్ పోలీసింగ్ తో పాటు సైబర్ పెట్రోలింగ్ ను కూడా విస్తృతంగా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed