శుభకార్యానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

by Rajesh |
శుభకార్యానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
X

దిశ,అల్లాదుర్గం : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా రేగోడ్ గ్రామానికి చెందిన వనం ప్రశాంత్, పవన్ అన్నదమ్ములు. కాగా శుభకార్యం నిమిత్తం శంకరంపేటకు వెళుతున్న సందర్భంలో అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామ శివారులో లారీ ఢీ కొట్టింది. దీంతో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా పవన్‌కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యాక్సిడెంట్ జరిగిన చోటుకి చేరుకుని బోరున విలపించారు. శుభకార్యానికి వెళ్తున్న తురుణంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story