నేడు, రేపు జాగ్రత్త.. తెలంగాణలో పెరగనున్న ఎండ తీవ్రత

by samatah |
నేడు, రేపు జాగ్రత్త.. తెలంగాణలో పెరగనున్న ఎండ తీవ్రత
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి ప్రజలు బయటకు రావాలంటే భయపడి పోతున్నారు. ఇక ఉదయం తొమ్మిది అయ్యందంటే చాలు భాను తన భగభగల చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యిందంటే వేడి సెగలు కక్కుతున్నాడు. మధ్యాహ్నం భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో పగలు 44 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో వేడి పెరుగుతోందని. నేడు, రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Read More: వ్యభిచార కేంద్రాలుగా ఓయో రూమ్స్?

Next Story