ఒక్కో నేత వంద మంది ఓటర్లకు వందనం చేయాలి.. Revanth Reddy పిలుపు

by Disha Web Desk 4 |
ఒక్కో నేత వంద మంది ఓటర్లకు వందనం చేయాలి.. Revanth Reddy పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 'మన మునుగోడు, మన కాంగ్రెస్' కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన జూమ్ మీటింగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 20న ఉదయం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన త్యాగం, సేవలు, దేశాభివృద్ధి గురించి మాట్లాడాలని నాయకులకు సూచించారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని, వాళ్ళను ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

తనతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాడాలన్నారు. రెండు అధికార పార్టీలు వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఉపఎన్నికల్లో అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. 'మన వెయ్యి మంది నాయకులు లక్ష మందికి పాదాభి వందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం' అని పిలుపునిచ్చారు. తను కూడా స్వయంగా మునుగోడులోని తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వారికి వందనాలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యన్ని పరిరక్షించే యుద్ధంలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed