REVANTH REDDY: చివరి నిమిషంలో భారీ ట్విస్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. వారికి రుణమాఫీ కట్

by Anjali |
REVANTH REDDY: చివరి నిమిషంలో భారీ ట్విస్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..  వారికి రుణమాఫీ కట్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు తాజాగా శుభవార్త అందించారు. రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 వ తారీకు లోపు రూ. 2 లక్షణ రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి రైతులకు ధీమా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇదేమాట చెబుతున్నాను. రైతులకు రుణమాఫీ పూర్తి చేసే వరకు ఇదే మాట మీద ఉంటానని వెల్లడించారు. దీనిపై మరో రెండ్రోజుల్లో రుణమాఫీ విధివిధానాలను ప్రకటించుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతు రుణమాఫీ అమలు కోసం అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మార్గదర్శకాలు ప్రకటించిన వాటికి అనుగుణంగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఇక రైతుల రుణాలు మాఫీ చేయడానికి రోజులే మిగిలుందని.. రోజుల వ్యవధిలోనే జరిగిపోతుందని తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీ షాక్ ఇచ్చారు. వీరికి రుణమాఫీ వర్తింపచేయొద్దని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే రుణమాఫీ కోసం 32 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో రూ. 10 వేల కోట్లను సిద్ధం చేశామన్నారు.

Next Story