రేవంత్ రెడ్డి కాబోయే ప్రధాన మంత్రి!.. బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డి కాబోయే ప్రధాన మంత్రి!.. బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తిగా పెయిడ్ మీడియా ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటాన్ని ప్రస్తావిస్తూ తన పేయిడ్ మీడియా చానెల్ రేవంత్ రెడ్డి అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తిగా చూపిస్తోందని, మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నడ్డా, నిర్మలా సీతారామన్, ముఖేష్ అంబానీల తర్వాత రేవంత్ రెడ్డి మోస్ట్ పాపులర్ లీడర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డితో సెల్ఫీ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చూపిస్తున్నారని, అంతేగాక బీజేపీ నాయకుల తర్వాత రేవంత్ రెడ్డిని ప్రస్తావించి, కాబోయే ప్రధాన మంత్రిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఏఐసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను చీఫ్ మినిష్టర్ గా మాత్రమే గుర్తించాడని, సీఎం రేవంత్ రెడ్డి గురించి పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత, డైనమిక్ లీడర్ అని మాట్లాడుతున్నారని అన్నారు.

రెండు సార్లు సీఎంగా చేసి, కాంగ్రెస్ పార్టీలో నిజమైన డైనమిక్ లీడర్ గా ఉన్న సిద్దారామయ్య గురించి అలా మాట్లాడి, 120 రోజులు ముఖ్యమంత్రిగా ఉండి, ఎన్నో కేసులు, వివాదాల్లో చిక్కుకొని, నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లడటంతో దేశం కోసం పనిచేసే నిజమైన కాంగ్రెస్ నాయకులకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని కేసీ వేణుగోపాల్ ను ప్రశ్నించారు. ఇంత అన్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పట్ల సిద్దారామయ్యకు ఉన్న నిబద్దత ఏంటీ, రేవంత్ రెడ్డికి ఉన్న ఏంటో తెలియదా అని, మీరే రేవంత్ రెడ్డి పాపులర్ చేస్తున్నారని ఆరోపించారు.

Next Story

Most Viewed