రేవంత్ రెడ్డి ఆయన కాలి గోటిపై వెంట్రుకకు సమానం కాడు!.. రఘునందన్ రావు హాట్ కామెంట్స్

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డి ఆయన కాలి గోటిపై వెంట్రుకకు సమానం కాడు!.. రఘునందన్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ వెన్నులో వణుకు మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఘాటుగా స్పందిచారు. మోడీ వెన్నులో వణుకు పుట్టడం రేవంత్ రెడ్డి వెళ్లి చూశారా అని, రేవంత్ రెడ్డి అనేటోడు మోడీ కాలి గోటి మీద ఉండే వెంట్రుకతో కూడా సమానం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ లాగా మోడీని తిట్టి పెద్దోడు అనిపించుకుందామని అనుకుంటాన్నాడెమో.. మోడీ.. కేడీ.. ఈడీ.. బోడీ.. అని తిట్టిన కేటీఆర్ పరిస్థితి ఏమైందో చూడాలన్నారు. రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందన్నారు. రేవంత్ రెడ్డి అహంకార పూరితమైన మాటలు బంద్ చేయాలని, కాంగ్రెస్ పార్టీకి త్రిబుల్ డిజిట్ దాటే అవకాశం లేదని, ఈ మాట వాళ్ల దీదీయే చెబుతుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడ మల్లన్న అంటారని, ఈ జాతి లక్షణాలు ఎవరికి మంచివి కాదని, తెలంగాణ సమాజం స్వాగతించదన్నారు.

అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి రెండు బోమ్మలు అని, దురదృష్టవశాత్తు పైకి ఎగరేసినప్పుడు ఒకటే కనిపిస్తుందని, కనపడదాన్ని ఇంకోటి కాపాడుతుందని రఘునందన్ రావు అన్నారు. అంతేగాక తనకు గడీలు ఉన్నాయని చెబుతున్నారని, అది ఎక్కడ ఉందో చూపిస్తే ఆయనకే రాసిస్తానని ఆఫర్ ఇచ్చారు. అలాగే మెదక్ కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని, దానిపై ఓ పుస్తకం తయారు చేయించానని, అది ఆయనకే కొరియర్ లో తన సొంత ఖర్చుతో పంపిస్తున్నానని చదువుకోవాలని సూచించారు.

Next Story