చంద్రబాబు ప్రమాణస్వీకారానికి CM రేవంత్‌ వెళ్లేనా?

by Gantepaka Srikanth |
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి CM రేవంత్‌ వెళ్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం కేవలం ఏపీ ప్రజలే కాకుండా తెలంగాణలోని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మహా ఘట్టానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే, ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా? వెళ్లరా? అనేది ఆసక్తిగా మారింది.

సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల‌కు ప‌క్క రాష్ట్రాల సీఎంలను పిల‌వ‌డం అనావాయితీ. గతంలోనూ జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీకి(కాంగ్రెస్) చెందిన రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రమాణస్వీకారానికి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే కూటమి గెలిచిన వెంటనే చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ రేవంత్ శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాకుండా సోషల్ మీడియా వేదికగా.. రెండు రాష్ట్రాల మద్య ఆరోగ్యక‌ర వాతావ‌రణం ఉండాల‌ని, విభ‌జ‌న చ‌ట్టాలను స్నేహ‌పూర్వక వాత‌వ‌ర‌ణం అమ‌లు చేసుకోవాల‌ని అభినందించి చెప్పారు. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి హాజరు అవుతారా? లేదా? అనేది ఉత్కంఠంగా మారింది.ల

Next Story

Most Viewed