సీఎం కేసీఆర్‌పై Revanth Reddy (అనుముల రేవంత్ రెడ్డి) ఆగ్రహం

by Disha Web Desk |
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లను పెద్ద ఎత్తున బంద్ చేశారనే వార్త కథనాలపై స్పందించిన ఆయన 'మాటలు కోటలు దాటించడం.. చేతలతో వాతలు పెట్టడం కేసీఆర్ నైజం' అంటూ ఎద్దేవా చేశారు. లక్ష మంది అవ్వ, తాతల పెన్షన్ కు కోత విధించడం క్షమించరాని నేరం అని మండిపడ్డారు. సీఎం జోక్యం చేసుకుని ఆ పెన్షన్లను పునరుద్ధరించాలని ట్విట్టర్ వేదికగా మంగళవారం డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్‌లో చాలా మందికి ఒక్క నెల మాత్రమే ఇచ్చి ఆ తర్వాత వారిలో చాలమందికి పెన్షన్ బంద్ చేశారని అయితే ఇలా జరగడానికి అధికారులు చెబుతున్న కారణాలు వింతగా ఉన్నాయనే విమర్శలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఫోర్ వీలర్ బండి ఉన్నా, ఐదెకరాల పొలం ఉన్న పెన్షన్లు రద్దు చేస్తున్నారని ఈ విధానం వల్ల టాటా ఏస్, ట్యాక్సీ కారు నడుపుకునే వాళ్ల కుటుంబాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత మూడున్నరేళ్లుగా కొత్త పెన్షన్లపై ఊరించిన కేసీఆర్ ప్రభుత్వం నెల రోజులకే 360 సాఫ్ట్ వేర్ తో కొత్త లిస్ట్ నుంచి పేర్లు తొలగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story