కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి..

by Satheesh |
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో తాజాగా చోటుచేసుకున్న ‘బుంగ’ (పైపింగ్ యాక్షన్) ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని.. కేసీఆర్ స్కామేశ్వరం అని ట్వీట్ ద్వారా ఫైర్ అయ్యారు. నిన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే నేడు అన్నారం బ్యారేజీలో మరో లోపం బైటపడిందన్నారు. కూలుతున్నవి బ్యారేజీలు కాదని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలన్నారు.

ప్రాజెక్టు అంటే కేసీఆర్ కట్టుకున్న ఫామ్ హౌజ్ ప్రహరీ గోడ అని అనుకున్నారా అంటూ ప్రశ్నించారు. లేదా కేసీఆర్ మనుమళ్లు ఆడుకునే ఇసుక గూళ్ళు అనుకున్నారా అని కామెంట్ చేశారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని మింగేసి నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టారని కేసీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లకు పైగా ఉనికిలో ఉండాల్సిన నిర్మాణాలు కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. “మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు..” అంటూ సెటైర్ వేశారు.

Next Story