రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ : Revanth Reddy

by Disha Web |
రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ : Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితతో పాటు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందని శుక్రవారం బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. 'చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉందని విమర్శించారు. 2010 ఫిబ్రవరి 2న ఆ కంపెనీలో డైరెక్టర్‌గా చేరానన్నారు. 13 రోజుల్లో ఫిబ్రవరి 15న రిజైన్ చేశానని వాటికి సంభందించిన ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో కంపెనీ క్లోజ్ అయిందని రేవంత్ పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర కథలు ఏ విధంగాను మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Also Read : పాల్వాయి స్రవంతికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు :Revanth ReddyNext Story