Revanth Reddy: ఆ వ్యాఖ్యలు సరికాదు.. కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి..

by Disha Web Desk 19 |
TPCC Chief Revanth Reddy Says Sorry to MP Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: TPCC Chief Revanth Reddy Says Sorry to MP Komatireddy Venkat Reddy| మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అద్దంకి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని రేవంత్ అన్నారు. అంతేకాకుండా హోంగార్డ్ ప్రస్తావన, చండూర్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ క్షమాపణ చెప్పారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డిది కీలక పాత్ర అని.. ఆయనంటే మాకు గౌరవం ఉందని రేవంత్ అన్నారు. అయితే, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడంతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించనున్న పాదయాత్రకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు అవుతారా..? లేరా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, ఈ విషయంలో మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ క్షమాపణలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే.. రేవంత్ రెడ్డి సారీపై స్పందిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. దయాకర్‌ను కాంగ్రెస్ నుండి బహిష్కరిస్తేనే.. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు. దీంతో ఈ వివాదం ఇప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి అభ్యర్థికి 8 మార్కులు


Next Story

Most Viewed