- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాన ఆలయాల్లో చేనేత శాలువాలే అందించాలి.. మంత్రి కొండా సురేఖకు వినతి
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు చేనేతతో తయారు చేసిన శాలువాలే అందించాలని మంత్రి కొండా సురేఖను కలిసి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య వినతిపత్రం అందజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు చేనేతతో తయారు చేసిన శాలువాలే అందించాలని మంత్రి కొండా సురేఖను కలిసి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అనేక దేవాలయాల్లో కృత్రిమ నూలుతో మరమగ్గాలతో, మిల్లుల్లో తయారైన శాలువాలు వినియోగిస్తున్నారని మంత్రికి వివరించారు. గజం అంజయ్య సూచనలను మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్వీకరించారు. అంజయ్య చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికుల పాత్ర అమూల్యమని అన్నారు. ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగం దిశగా ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీఇచ్చారు.
చేనేత రంగ పురోగతికి, చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖను రోజు జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చేనేతకారులు స్వచ్ఛమైన నూలుతో తయారైన శాలువాతో మంత్రిని సత్కరించారు.
యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ తదితర ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొనే భక్తులకు అందించే శాలువాలు ప్రస్తుతం పెద్దమొత్తంలో మరమగ్గాలు, మిల్లుల్లో కృత్రిమ నూలుతో తయారవుతున్నాయని ఆయన మంత్రి సురేఖ గారికి వివరించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తున్న పరిస్థితుల్లో సింథటిక్ నూలుతో తయారైన శాలువాల వినియోగాన్ని కొనసాగించడం సముచితం కాదని తన అభిప్రాయాన్ని మంత్రి సురేఖకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో చేనేత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.






