- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Removal of jobs: పార్ట్ టైం లెక్చరర్లు, సబ్జెక్ట్ అసోసియేట్లకు బిగ్ షాక్.. ఉగ్యోగాల తొలగింపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో పార్ట్ టైం లెక్చరర్లను, సబ్జెక్ట్ అసోసియేట్లను తొలగించింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమను అన్యాయంగా విధుల్లో నుంచి తొలగించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కారణాలు ఏమీ చెప్పకుండానే ఉన్నపలంగా తొలగింపులు చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 250 మంది సబ్జెక్ట్ అసోసియేట్స్, 4,500 మంది పార్ట్ టైం అధ్యాపకులు, టీచర్లు రోడ్డున పడ్డారు. తాము గురుకుల బోర్డు నిర్వహించిన రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, డెమోలో నెగ్గిన తరువాతే విధుల్లో చేరామని.. ఇపుడు మమ్మల్ని ఏ కారణంగా తొలగించారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇటీవల అందరినీ కొనసాగిస్తామని ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ.. ఇపుడు అకస్మాత్తుగా తొలగించడంతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.