- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (Kadiam Srihari).. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం తో బీఆర్ఎస్ పార్టీ నేతలు (BRS party leaders) పార్టీ ఫిరాయింపుల (Party defections) పై సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. దింతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు.. త్వరలో ఉప ఎన్నికలు (By-elections) రాబోతున్నాయని.. అందరూ సిద్ధంగా ఉండాలని తమ కార్యకర్తకలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు నోటీసుల (Supreme Court Notices) పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiam Srihari responded) స్పందించారు. కోర్టు తీర్పు (Court judgment) ఎలా వచ్చిన శిరసా వహిస్తానని కడియం చెప్పుకొచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎటు పారిపోయే పరిస్థితి అసలు లేదని కడియం తేల్చి చెప్పారు.
అలాగే ఫిరాయింపులపై బీఆర్ఎస్ (BRS on defections)కు మాట్లాడే అర్హత లేదని, గత పది సంవత్సరాల్లో ఆ పార్టీ 36 మంది ఎమ్మెల్యేను బీఆర్ఎస్ (BRS) లోకి తీసుకొని వారిని మంత్రులు కూడా చేసిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiam Srihari) గుర్తు చేశారు. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్ ఓటమికి బీఆర్ఎస్ కారణమని (BRS is the reason for AAP's defeat), లిక్కర్ స్కాంలో సీఎం సహా ముగ్గురు జైలుకెళ్లారని అన్నారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే.. ఈ రోజు ఫలితాలు మరో విధంగా ఉండేవని, ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం (MLA Kadiam) సూచించారు.