బండిసంజయ్‌పై రసమయి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు (వీడియో)

by Rajesh |
బండిసంజయ్‌పై రసమయి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తలపెట్టిన కదనభేరీ సభలో బీజేపీ ఎంపీ బండిసంజయ్‌పై మాజీ ఎమ్మెల్యే రసమయి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అసలు బండికి మీటర్ తెల్వది.. మోటర్ తెల్వది అన్నారు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదని వ్యంగ్యంగా అన్నారు. మీటర్ ఉంటేనే కొట్లాడుతారన్నారు. బండి చేస్తున్న యాత్రను ఉద్దేశించి ‘చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు పైన పైన పడతనంటడు’ అంటూ పాట పాడి సెటైర్లు వేశారు. ప్రజా యాత్ర చేస్తే ప్రజల దగ్గరికి పోవాలని.. ఎండిన చేను దగ్గరికి, చెలక దగ్గరికి పోవాలని.. కానీ బండి మీసాలు వచ్చిన యువకుల దగ్గరికి వెళ్తున్నారని కామెంట్ చేశారు. వాళ్లను చూడగానే బండి ప్రాణం కొట్టుకుంటుందన్నారు. ఏప్పుడూ.. ఇవ్వాళ ఏం వారమే రేపు ఏం వారమే అని బండి అంటారని మండిపడ్డారు. దొడ్లో బర్రెలగా బండి అన్నా.. అంటారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక బండిపై రసమయి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed