- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
HYD : ఈఎస్ఐ అత్యాచారం కేసు.. నిందితుడు అరెస్ట్

దిశ, ఖైరతాబాద్ : ఎరగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగి సోదరిపై క్యాంటీన్‌లో పనిచేసే వ్యక్తి లిఫ్టులో బలవంతంగా పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షాబాద్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మూడు రోజుల నుంచి పరారీలో వున్న షాదాబ్‌ను ఎట్టకేలకు ఎస్ ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ఈఏస్ఐ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది.
వారం రోజుల నుండి యువతి అన్నయ్యకు సనత్ నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించింది. బాధితుడికి ఇటీవల నొప్పి ఎక్కువకావడంతో.. ఈ నెల 6న సోద రుడిని తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. రాత్రి సోదరుడికి ఆహారం తీసుకురావడానికి ఐదో అంతస్తు నుంచి యువతి కిందికి వచ్చింది. తిరిగి వెళ్లబోతుంటే ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆమెకు అక్కడి క్యాంటీన్లో పనిచేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. ఏదైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని సూచించాడు.
ఆమె తిరిగి లిఫ్టులో వెళ్తుంటే షాదాబ్ అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రక్త పరీక్షలు చేసే గదిలో మరోసారి అత్యాచారం చేశాడు. యువతి సోదరుడికి ఫోన్ చేయగా..అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు షాదాబ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.