- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మీ అభిమానమే నా గెలుపుకు నిదర్శనం : రోహిత్ రెడ్డి
దిశ, తాండూరు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీ అభిమానం, ఆప్యాయత చూస్తుంటే నా గెలుపుకు ఇదే నిదర్శనమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో మైనారిటీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు ప్రశాంతంగా ఉండాలంటే తాండూరు గొప్పగా అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలి. మైనారిటీలను రాజకీయంగా వాడుకునేందుకు భారీ కుట్ర జరుగుతుందన్నారు. ప్రతి మైనారిటీ సోదరుడు అర్థం చేసుకోవాలి, లేదంటే తాండూరు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 5 నిమిషాలు హిందీలో మాట్లాడు లేదా పట్టుమని పదిమంది మైనారిటీల పేర్లు కూడా చెప్పలేరని అన్నారు. తాండూరు ప్రజల అభిమానం మరువలేదన్నారు.
రెండు సంవత్సరాల్లో 1684 కోట్ల రూపాయలతో తాండూరు రూపురేఖలు మార్చానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి చేసిన ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డి కే దక్కిందన్నారు. నేడు 90% కాలుష్యం తగ్గించిన ఘనత నాకే దక్కింది అన్నారు. ఏళ్లుగా గత పాలకులు ముస్లిం మైనార్టీలను విస్మరించారన్నారు. ఒక కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసి, నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ లాగా షాదీ ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్నారన్నారు. రంజాన్ పండగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. గతంలో మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.