భీం భరత్ ను గెలిపించండి : రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
భీం భరత్ ను గెలిపించండి : రేవంత్ రెడ్డి
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీంభరత్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్ల మండల పరిధిలోని మల్లారెడ్డి గూడ గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని తెలిపారు. ఎన్నికల అయ్యే వరకు యువత కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మైపాల్, మహేందర్, అరుణ్ కుమార్, సాయిరాం పాల్గొన్నారు.

Next Story