- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చేవెళ్ల కాంగ్రెస్ లో ఎదురు గాలులు..

దిశ, చేవెళ్ల : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. చేవెళ్లలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో పార్టీ కోసం పార్టీ జెండా మోసిన వారికి న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి రాష్ట్రంలో జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీలో కష్టపడ్డ సీనియర్ నాయకులకు కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట వచ్చిన నాయకులకు మధ్య పొత్తు కుదరడం లేదు.
పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా పార్టీ కోసం నిలబడ్డ వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని చేవెళ్ల కాంగ్రెస్ లో అంతర్గతంగా పెద్దయుద్ధమే జరుగుతుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల తీరు పై సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రజా సమస్యలను తీరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, స్థానిక ఎన్నికల్లో న్యాయం జరగకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీపీ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చేవెళ్లలో ఏమి జరుగుతోందో అని మేధావులు, సామాజిక కార్యకర్తలు చర్చలు జరుపుకుంటున్నారు.