మాడ్గులలో కాంగ్రెస్ ఉందా.. లేదా?

by Disha Web Desk 12 |
మాడ్గులలో కాంగ్రెస్ ఉందా.. లేదా?
X

దిశ, ఆమనగల్: కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గా పేరుగాంచిన మాడుగుల మండలం లో ఆధిపత్య పోరుతో నేడు మండలం లో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలో జడ్పిటిసి ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ నిస్తేజంలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. రైతుల సమస్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం మాడుగుల మండలం లో నిర్వహించకపోవడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అత్తగారి సొంత మండలం లో కాంగ్రెస్ వెనుకంజ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న సుద్దపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు గౌడ్ పార్టీకి రాజీనామా చేయడంతో బడుగు బలహీన వర్గాలకు పార్టీ దూరమైనట్లు చర్చ నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన మాడుగుల మండలం ప్రస్తుతం పార్టీ పేరు చెప్పుకోవడంలో అనాసక్తి ప్రదర్శిస్తున్నారు.

ఆమనగల్లు లో సైతం

టీపీసీసీ పిలుపుమేరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆమనగల్లు మండల కేంద్రంలో కార్యకర్తలు, ప్రజలు ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.మండలం లో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించే. నాయకత్వం లేక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. గురువారం రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమం తూతూ మంత్రంగా నిర్వహించారు.

కడ్తాల్, తలకొండపల్లి లో బలంగా..

కడ్తాల్ మండలం లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు యాట నర్సింహా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రోజుకు బలం పుంజుకుంటుంది. అధిష్టానం ఇచ్చిన పిలుపుకు భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు జోష్ పెరుగుతుంది. గురువారం రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసన లో భారీ సంఖ్యలో కార్యకర్తలు రైతులు మహిళలు పాల్గొన్నారు.అదే విధంగా తలకొండపల్లి లో సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటును పొందుటకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కల్వకుర్తి నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.


Next Story

Most Viewed