అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు : తాండూరు ఎమ్మెల్యే

by Kalyani |
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు : తాండూరు ఎమ్మెల్యే
X

దిశ, తాండూరు : అర్హులైన వారందరికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనాని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మండలం, తాండూరు పట్టణంతో పాటు పెద్దేముల్ మండలంలోని కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. మొత్తం 237 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా రూ. 2 కోట్ల 37లక్షల 27వేల 492ల విలువైన చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాల ఆడపిల్లల పెండ్లి ఖర్చు భారం తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదింటి ఆడబిడ్డ మేడలో బంగారం ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం త్వరలో తులం బంగారం కూడా ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న,ఎంపీపీ అనిత రవి గౌడ్,మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్,ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed