టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు

by Disha Web Desk 13 |
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు
X

దిశ, కొడంగల్: కొడంగల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గాంధీనగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు అడ్డుకున్నారు. దళిత బంధు పథకం నిరుపేదలైన దళితులకు అర్హులైన దళితులకు ఇవ్వాలి కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.

దళిత బంధు పథకం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమేనా అని నిలదీశారు. దళిత బంధు మా అందరికీ ఇవ్వాలని లేనిపక్షంలో ధర్నాలు నిరసనలు చేపడతామని ఎమ్మెల్యేని హెచ్చరించారు. గాంధీనగర్‌కు చెందిన మహిళలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ సొంత జేబులో నుంచి ఇంటిలో నుంచి ఇవ్వటం లేదని ప్రభుత్వం ఖజానా నుండి ఇస్తున్నారన్నారు.

దళితులందరికీ వర్తింప చేయాలని ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున దలిత బంధు అందజేయాలని డిమాండ్ చేశారు. అనుకోని సంఘటన ఎదురు కావడంతో ఒకింత అసహనానికి గురైన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మహిళలపై, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజుపై విరుచుకుపడ్డారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున పార్టీలకతీతంగా ఇవ్వాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపడతామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో దళితులందరూ బుద్ధి చెప్తారని దళితులపై విరుచుకుపడిన ఎమ్మెల్యే తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed