ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి.. తహాశీల్దార్‌కు వినతి

by Disha Web Desk 13 |
ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి.. తహాశీల్దార్‌కు వినతి
X

దిశ, మీర్ పేట: బాలాపూర్ మండలం, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సర్వేనెంబర్ 119 లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కమలా నెహ్రూ నగర్ కాలనీ వాసులు మండల రెవెన్యూ అధికారి జనార్ధన్ రావు ను కోరారు. హుడా క్వార్టర్స్ పక్కన గల సుమారు వెయ్యి గజాలకు పైగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కబ్జాకు గురి కాకుండా కాపాడాలని‌ ఎంఆర్పీఎస్ నాయకుడు డి. కె నర్సింహా ఆధ్వర్యంలో బస్తీవాసులు తహాశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నించడంతో తాము ఫిర్యాదు చేయగా అప్పటి ఎమ్మార్వో సూచిక బోర్డును పెట్టారు. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కాలనీ వాసులకు ఉపయోగపడేలా ఈ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని బస్తీవాసులు ఎమ్మార్వో ను కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆంజనేయులు, శంకర్, జనార్ధన్, నరసింహ, రాజు, కృష్ణ, రాజేందర్, రవి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.Next Story