ఘనంగా విజ్ఞాన్ మోడల్ స్కూల్ వార్షికోత్సవం

by Disha Web Desk 20 |
ఘనంగా విజ్ఞాన్ మోడల్ స్కూల్ వార్షికోత్సవం
X

దిశ, అబ్ధుల్లాపూర్మెట్ : చిన్నారులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని బాట సింగారం గ్రామంలో విజ్జాన్ మోడల్ స్కూల్ 27వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు చిన్నతనం నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, అలాంటప్పుడే రానున్న రోజులలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని స్పష్టం చేశారు. విద్యతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు క్రీడలలో కూడా పాల్గోనేలా ప్రోత్సహించాలని, చిన్నారుల ప్రతిభను ముందే గుర్తించాలని అన్నారు.

అంతకు ముందు పాఠశాల యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో సూదగాని హరిశంకర్, పాఠశాల చైర్మన్ మోడెపు జంగయ్య గౌడ్, జెడ్పీటీసీ బింగి దాసుగౌడ్, సర్పంచ్ ఎర్రవల్లి లతశ్రీ గౌరి శంకర్, జిల్లా ట్రెస్మా అధ్యక్షులు నారాయణరెడ్డి, ట్రెసరర్ మీనేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గొపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బండిగారి విష్ణు, ఎంపీటీసీ కె.వెంకటేష్, మహేందర్, సర్పంచ్ రాధా కృష్ణ, లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నోముల జగదీష్, గౌస్ పాషా, యాదగిరి, యువకులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Next Story