పాడి పశుల ప్రాణాలు తీసిన కలుషిత ఆహారం

by Web Desk |
పాడి పశుల ప్రాణాలు తీసిన కలుషిత ఆహారం
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానమ్మ చెరువు వద్ద ప్లాస్టిక్ సంచుల్లో కలుషిత ఆహారం మూటలు వేశారు. దాంతో వాటిని తిన్న రెండు పాడి ఆవులు దుర్మరణం చెందాయి. ఫరూక్ నగర్‌కు చెందిన మహ్మద్ పాల ద్వారా జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే జానమ్మ చెరువు వద్ద గడ్డి మేస్తూ అక్కడే నీళ్లు తాగే పశువులు సోమవారం కలుషిత ఆహారం తిని అపస్మారక స్థితికి చేరుకున్నాయి. ఆ సంచుల్లో చెడిపోయిన ఆహారం, ఇతరత్రా ప్లాస్టిక్ కవర్లు, కెమికల్ వస్తువులు ఉన్నాయి. ఆవులు ఆ సంచులను తినడంతో రక్త విరేచనాలు, వాంతులకు గురయ్యాయి.

ఆ తర్వాత దారుణమైన స్థితిలో రెండు ఆవులు మృతి చెందాయి. అయితే ఇటీవల ఈ రెండు ఆవులు రెండు లేగదూడలకు జన్మనిచ్చాయి. ఇప్పుడు ఆవులు మరణించడంతో తల్లి కోసం లేగదూడలు తల్లడిల్లుతున్నాయి. పాల వ్యాపారం చేసుకుని జీవించే మహ్మద్ పరిస్థితి దారుణంగా ఉంది. తన పశువుల మృతితో అతడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు. కొందరు విచక్షణ లేకుండా చేస్తున్న చర్యల కారణంగా అన్యం పుణ్యం తెలియని మూగజీవాలు మాత్రం మృత్యువాత పడుతున్నాయి.

Next Story

Most Viewed