పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న యువతి.. చివరికి అపార్ట్‌మెంట్‌లో అలా కనిపించింది

by Disha Web |
పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న యువతి.. చివరికి అపార్ట్‌మెంట్‌లో అలా కనిపించింది
X

దిశ, శంషాబాద్: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో.. అపార్టుమెంటులో ఉరివేసుకొని మృతి చెందిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్ మొగల్ రెసిడెన్సీ అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ 301 నుండి దుర్వాసన రావడంతో, అపార్ట్ మెంట్‌లో ఉన్నవాళ్లు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తొలగించి చూడగా అందులో యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువతి సమీరా బేగం (23) గా గుర్తించారు.

అదే అపార్ట్ మెంట్‌లో గత వారం రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని.. ఈ వేడుకలు జరిపింది ఎవరు..? ఆ వేడుకలో ఎవరెవరు..? పాల్గొన్నారు అనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా. యువతి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అనే కోణంలో కూడా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Next Story

Most Viewed