చేవెళ్ల మున్సిపాలిటీ మాకొద్దు...

by Sumithra |
చేవెళ్ల మున్సిపాలిటీ మాకొద్దు...
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సమన్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి హామీని కోల్పోయే అవకాశం ఉంది. గ్రామపంచాయతీలో అయితే ఏ సమస్య ఉన్నసర్పంచ్ తో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా ఉంటుంది కానీ మున్సిపాలిటీలో అలా అవకాశం ఉండదు మున్సిపాలిటీ అయితే ఇంటి టాక్సీ ముడింతలు పెరిగే అవకాశం ఉంది. చేవెళ్లలో ఏమి అభివృద్ధి జరిగిందని మున్సిపాలిటీ చేస్తున్నారు. పార్లమెంట్ స్థానమైన చేవెళ్లలో ఎంతో ఆదాయం ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి సొంత భవనం లేదు, ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనం లేదు, 2013లో బస్ డిపో కోసం శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు ఎలాంటి పనిముందుకు సాగలేదు. పార్లమెంట్ కేంద్రంగా చేవెళ్లలో కనీసం డిగ్రీ కాలేజ్ భవనం ఇంకా పూర్తి కాలేదు. ఒక పీజీ కాలేజీ లేదు, ఐటీఐ కాలేజ్ లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లేదు ఇవి ఏమీ లేకుండానే ఎలా మున్సిపాలిటీ చేస్తారు.

కేవలం ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ అని అంటున్నారు. కానీ 2018లో మున్సిపాలిటీ అవుతుంది అని చెప్పి 15కోట్లు మంజూరు చేసి జీవో చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మళ్లీ మున్సిపాలిటీ అని చెప్తున్నారు. ఎలక్షన్ టైం రాగానే చేవెళ్ల మున్సిపాలిటీ అని, 111 జీవో ఎత్తేసామని చేవెళ్ల ప్రజలను మోసం చేస్తుర్రు ఎంపీ, ఎమ్మెల్యే అని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరానికి కూత వేటు దూరంలో ఉన్న చేవెళ్ల అభివృద్ధికి నోచుకోలేదు ఎలా మున్సిపాలిటీ చేస్తారు. మీరు మున్సిపాలిటీ చేయాలనుకుంటే గ్రామాలలో గ్రామసభలు పెట్టి తీర్మానం చేస్తే బాగుంటుంది. మున్సిపాలిటీలో ఒకటో రెండు గ్రామాలు కలుపుకుంటే ఓకే గాని ఏకంగా 10 గ్రామాలు కలుపుకొని ఎలా చేస్తారు. మున్సిపాలిటీ చేయాలనుకుంటే ప్రజా అభిప్రాయం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు సున్నపు వసంతం, డీసీసీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, పాటి దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, పాండు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story