లక్షరూపాయలు ఎగొట్టడానికే కిడ్నాప్​ డ్రామా ఆడిన వ్యక్తి..

by Disha Web Desk 20 |
లక్షరూపాయలు ఎగొట్టడానికే కిడ్నాప్​ డ్రామా ఆడిన వ్యక్తి..
X

దిశ, బడంగ్​పేట్ : అరువుగా తీసుకున్న లక్ష రూపాయలు ​ఎగొట్టడానికి రమేష్​ ఆడిన ఫేక్​ కిడ్నాప్, హత్య డ్రామాను బాలాపూర్​ పోలీసులు తెరదించారు. బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ బి.భాస్కర్​ తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీ ఉప్పుగూడ సాయిబాబానగర్​కు చెందిన రమేష్​ (40) వృత్తి రిత్యా లేబర్​. అదే కాలనీకి చెందిన వృత్తి రిత్యా లేబర్​ అయిన పెద్దయ్య వద్ద నుంచి మూడు సంవత్సరాల క్రితం లక్షరూపాయలను అరువుగా తీసుకున్నాడు. అరువుగా తీసుకున్న డబ్బులు పెద్దయ్య తిరిగి ఇవ్వాలని రమేష్​ పై ఒత్తిడి చేయసాగాడు. దీంతో పెద్దయ్య కుటుంబం పై రమేష్​ కక్ష్యపెంచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే ఎలాగైనా పెద్దయ్యను, అతని కొడుకుని పోలీసుకేసులో ఇరికిస్తే లక్షరూపాయలు ఎగొట్టవచ్చని పథకాన్ని రచించాడు.

ఈ నేపధ్యంలోనే మార్చి 28వ తేదీన సాయంత్రం సమయంలో రమేష్​ ఆటోలో దేవతల గుట్ట సమీపంలోని ఆర్​సీఐ మెయిన్​ రోడ్​ వద్ద దిగాడు. అక్కడ కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వైర్లతో ముందుగా కాళ్ళను గట్టిగా కట్టేసుకున్నాడు. అనంతరం చేతులు వెనకకు పెట్టుకుని ఒక చేతికి వైర్​ను గట్టిగా, మరో చేతికి కాస్త లూస్​గా కట్టుకున్నాడు. నోట్లో పెట్టీపెట్టనట్టు గుడ్డను పెట్టుకుని కింద పడి పెనుగులాడడం, గట్టిగా ములగడం ప్రారంభించాడు. అటుగా వచ్చిన అయోధ్యనగర్​కు చెందిన కళ్యాణ్ బాలాపూర్​ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతని కాళ్లకు, చేతులకు ఉన్న వైర్లను తొలగించారు. తనను పెద్దయ్య కుమారుడు సురేష్​ పని ఇప్పిస్తానని ఇక్కడికి తీసుకువచ్చి వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదాడని, హత్య చేయబోయడాని రమేష్​ బాలాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన బాలాపూర్​ పోలీసులకు రమేష్​ ఫిర్యాదు లో పేర్కొన్న ప్రకారం సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటోలో రమేష్​ ఒక్కడే దిగినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దయ్య కుమారుడు సురేష్​ కాల్​డాటా ఆధారంగా లోకేషన్​ చెక్​ చేయగా గుంటూరులో ఉన్నట్లు నిర్దారించారు. మరోసారి అతని విచారించగా గుంటూరులోనే ఉన్నట్లు సురేష్​ చెప్పడంతో పోలీసులు తనదైన స్టైల్​లో రమేష్​ను విచారించారు. పెద్దయ్యకు లక్షరూపాయలు ఎగొట్టడానికే ఈ ఫేక్​ కిడ్నాప్​ హత్య డ్రామా పన్నానని పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గతంలో రమేష్​ ఓ కిడ్నాప్​ డ్రామా అడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను తప్పు దోవ పట్టించిన రమేష్​ పై కఠిన చర్యలు తీసుకుంటామని బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ తెలిపారు. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed