ప్రధాన రహదారి గుంతల మయం..నెలలు గడవక ముందుకే పాడైన రోడ్లు

by Aamani |
ప్రధాన రహదారి గుంతల మయం..నెలలు గడవక ముందుకే పాడైన రోడ్లు
X

దిశ,మీర్‌పేట్: ప్రభుత్వం ప్రజలకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపరచడానికి కోట్లాది రూపాయలు కేటాయించింది.మీర్ పేట్ కార్పొరేషన్ లోని ప్రధాన రహదారి పై జిల్లేల గూడ అంబేద్కర్ విగ్రహం నుండి అల్మాస్ గూడ కమాన్ వరకు రోడ్డు విస్తరణ చేసి రోడ్లు వేశారు.వేసిన రోడ్లు నాలుగు కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా వేసిన రోడ్లు నాలుగు కాలాల కాకముందే గుంతల మయంగా మారింది.రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న ఒక నాయకుడు తూ తూ మంత్రంగా రోడ్లు వేసి చేతులు దులుపుకున్నాడు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు ఎక్కడ కూడా రోడ్డు విస్తరణ పనులు జరగలేదు. ఒక దగ్గర ఒక తీరుగా మరో దగ్గర మరొక విధంగా రోడ్లు వేశారు.కొంతమంది రాజకీయ నాయకుల ఇండ్లు పోతాయనే ఉద్దేశం తో అక్కడ రోడ్డు విస్తరణ చేపట్టలేదు.కొందరి ఇండ్ల ముందు ఒక తీరుగా మరికొందరి ఇండ్ల ముందు మరో రకంగా రోడ్డు విస్తరణ చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి.

అధికారులు కూడా సదరు కాంట్రాక్టర్ చెప్పిందే వేదం గా భావించి రోడ్లు ఎలా వేసిన పరిశీలించకుండా బిల్లులు మాత్రం ఇచ్చారు.నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. రోడ్డు ఎలా ఉంటే మనకేంటి అని అన్నట్లు గా అధికారుల తీరు రోడ్డు దుస్థితిని చూస్తే కనిపిస్తుంది ఇలాంటి అభివృద్ధి పనుల పై పై అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం తోనే కింది స్థాయి అధికారులు ఆడిందే ఆట పాడింది పాటగా చలామణి అవుతుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేసిన సదురు కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు కోట్లాది రూపాయలు వెచ్చించి వేసిన రోడ్లు మూడు నెలల ముచ్చటగానే మారిపోయాయి. గుంతల మయంగా మారిన రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.Next Story

Most Viewed