విద్యార్థులకు నరకంగా మారిన ఆర్టీసీ బస్సు ప్రయాణం

by Disha Web Desk 12 |
విద్యార్థులకు నరకంగా మారిన ఆర్టీసీ బస్సు ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు ప్రయాణం నరకంగా మారింది. చదువుకోవడానికి శంషాబాద్‌కి రావాలంటే బస్సులతో రోజు చిన్నపాటి యద్ధం చెయ్యాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాలేజీ సమయానికి సరిపడా బస్సులు లేక అమ్మాయిలు ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా సిద్దాపూర్ నుండి శంషాబాద్ వచ్చే బస్సులో పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుకి ఓవర్ లోడ్ కావడంతో ఎప్పుడు ఏమైతదో తెలియని పరిస్థితి. అధికారులు స్పందించి సరిపడా బస్సులు వెయ్యాలని విద్యార్థులు కోరుతున్నారు. బస్సుల కొరత పై విద్యార్థులు మాట్లాడుతూ.. కాలేజీ సమయం 6 గంటలు ఉంటుంది.. అలాగే మా ప్రయాణం ఆరు గంటలు ఉంటుంది అంటూ ఛలోక్తులు వేస్తున్నారు.


Next Story

Most Viewed