'నీ చావు నువ్వు చావు' అంటూ భర్తకు మెసేజ్​ చేసి భార్య అదృశ్యం..

by Disha Web |
నీ చావు నువ్వు చావు అంటూ భర్తకు మెసేజ్​ చేసి భార్య అదృశ్యం..
X

దిశ, కుల్కచర్ల: తల్లికి అనారోగ్యంగా ఉందని కొడుకు, కోడలు స్వగ్రామానికి వచ్చి ఓ వివాహిత అదృశ్యమైంది. కుల్కచర్ల ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. బొందిలి శ్రీధర్​ ప్రసాద్–రిజ్వా లా అలియాస్​శ్రావ్య భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. వీరు కొంతకాలంగా హైదరాద్‌లో ఉంటున్నారు. కాగా, శ్రీధర్​ ప్రసాద్ ​తల్లికి ఆనారోగ్యంగా ఉందని భార్య, కొడుకు తో కలిసి స్వగ్రామమైన కుల్కచర్ల కు వచ్చారు.

తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉన్నట్టుండి రిజ్వానా అలియాస్ శ్రావ్య సోమవారం ఉదయం 11 గంటలకు భర్తకు నీ చావు నువ్వు చావు అంటూ మెసేజ్​ చేసిన భార్య అదృశ్యమైంది. భర్త మెసేజ్​చూసి గ్రామంలోని ఇరుగు, పొరుగు, స్నేహితులు, బంధువుల వద్ద ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు.


Next Story