గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కసిరెడ్డి

by Sumithra |
గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కసిరెడ్డి
X

దిశ, కడ్తాల్ : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం అని, గ్రామాల అభివృద్ధి కోసం సీఆర్ఆర్ ఫండ్, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 1.30 కోట్లు విధులు మంజూరయ్యాయని, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలోని పలు గ్రామాలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, వివిధ గ్రామాల ప్రయోజనాల కోసం కేటాయించిందని, అందులో భాగంగా 35 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో, సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి అన్నారు.

ఏఎంసీ చైర్మన్ యాట గీత, నర్సింహ, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, అధికారులు ఎంపీడీవో సుజాత, గ్రామ కార్యదర్శి అల్లాజీ, డీసీసీ ప్రధాన కార్యదర్శి భీఖ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు బీచ్యా నాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, ఎస్సీ సెల్ బ్లాక్ అధ్యక్షులు రామకృష్ణ, సేవాదళ్ మండల అధ్యక్షులు లక్ష్మయ్య, ఎస్సీ సెల్ మండల అద్యక్షులు పోతుగంటి అశోక్, బీసీ సెల్ మండల అధ్యక్షులు యాదయ్య, టౌన్ వర్కింగ్ అద్యక్షులు రామచందర్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ నరేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు క్యామ రాజేష్, జాంగిర్ అలి, జాంగిర్ బాబా, బ్రహ్మచారి, వెంకటయ్య, సత్యం యాదవ్, వేణు పంతులు, మల్లయ్య, చందోజీ, యాదగిరి రెడ్డి, బిక్షపతి, శంకర్, లకృతి నాయక్, చెన్నయ్య, శంకర్, మంకీ శ్రీను, మహేష్, పర్వతాలు, శేఖర్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు షాబుద్దీన్ ఇమ్రాన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోసు రవి, టౌన్ అధ్యక్షులు భాను కిరణ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, కర్రోల రమేష్, రామకృష్ణ, తుప్పరి మహేష్, భరత్ యాదవ్, శరత్, తులసీరామ్, వెంకటేష్, నరేష్, శివ, అంజయ్య, సంతోష్, శ్రీకాంత్, ప్రవీణ్, భాష, విజయ్, సత్యం, శ్రీశైలం,సురేష్, రాజు, రమేష్, మహేష్, సేవ్య, శ్రీను, పత్యా,తదితరులు పాల్గొన్నారు.

చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే...

శనివారం ప్రారంభమై ఈ నెల 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ వార్షికోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఆలయ అర్చకులు వేణు, శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పత్రికా విలేఖరి కుటుంబానికి పరామర్శ..

కొన్ని రోజుల క్రితం సాక్షి దినపత్రిక విలేఖరి కందికంటి మల్లేష్ మాతృమూర్తి, యాదమ్మ అనారోగ్యంతో మృతిచెందగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం వారి నివాసంలో నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా రెండో వార్డుకు చెందిన కలే చిన్న కొన్ని రోజుల క్రితం పనిచేస్తుండగా ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న, చిన్నాకు ఆర్థిక సాయం అందజేస్తూ,ఎవరు అధైర్య పడద్దని మేము మా నాయకులు ప్రభుత్వం అండగా ఉంటుందని,ధైర్యాన్ని కల్పించారని తెలిపారు.

Next Story