మోమిన్‌పేట్‌లో విత్తనాలు, ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

by Taduka Kalyani |

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం నాడు మోమిన్‌పేట్ మండలంలో టాస్క్‌ఫోర్స్ బృందం విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది.

మోమిన్‌పేట్‌లో విత్తనాలు, ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, మోమిన్‌ పెట్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం నాడు మోమిన్‌పేట్ మండలంలో టాస్క్‌ఫోర్స్ బృందం విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న విత్తనాల నాణ్యత, నిల్వలు (స్టాక్), ఎరువుల లభ్యత, విక్రయ రికార్డులు, లైసెన్సుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. రైతులకు నాసిరకం విత్తనాలు లేదా ఎరువులు విక్రయించకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వ్యాపారులకు సూచించారు. వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని, ఏవైనా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మండల తహసీల్దార్ రవీందర్ మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ రెడ్డి, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ భరత్ భూషణ్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు జీపీఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Next Story