కాంగ్రెస్​ను ఆదరించండి : మాజీ ఉప ముఖ్యమంత్రి

by Aamani |
కాంగ్రెస్​ను ఆదరించండి : మాజీ ఉప ముఖ్యమంత్రి
X

దిశ, పరిగి: తుక్కుగూడ లో జరిగిన విజయభేరీ కార్యక్రమంలో తెలంగాణ సోనియా గాంధీ ప్రదాత మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 హామీలను ప్రభుత్వాల పై ఛార్జ్ షీట్ ప్రకటించడానికి CWC మెంబర్, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ జిందర్ సింగ్ పరిగి కి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి తో కలిసి పరిగి పట్టణంలో NTR నగర్, ప్రేమ్ నగర్ కాలనీ లో ఇండ్లకు తిరిగి కాంగ్రెస్ గారంటీ కార్డ్ ఇస్తూ గోడపై చార్జీ షీట్ ను అతికించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తే గ్యారెంటీ నెంబర్ 1 మహాలక్ష్మి ప్రతినెలా మహిళలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ,గ్యారెంటీ నెంబర్ 2 రైతు భరోసా,ప్రతిఏటా రైతులు,కౌలు రైతులకు ఎకరాకి రూ.15 వేలు వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు , వరి పంటకు రూ.500 బోనస్, గ్యారంటీ నెంబర్ 3 గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యారంటీ నెంబర్ 4, ఇందిరమ్మ ఇండ్లు , ఇంటి స్థలం రూ.5లక్షలు , ఉద్యమకారులకు 250 గజాల స్థలం , గ్యారెంటీ నెంబర్ 5 యువ వికాసం రూ.5లక్షలతో విద్యార్థులకు యువభరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నెషనల్ స్కూల్స్ , గ్యారంటీ నెంబర్ 6 చేయూత రూ.4 వేల పింఛన్ , రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా పంజాబ్​ లో రెండు లక్షల రుణ మాఫీ చేశాసామన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం ఇక్కడ కూడా ఎందుకు రుణమాఫీ చేయాలన్నారు. రాజస్థాన్ నేను ఇంఛార్జి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో రాజస్థాన్ లో సిలిండర్ 500 కు ఇచ్చి మేము ఇచ్చే 6 గ్యారెంటీ లు అమలు చేస్తామన్నారు. దేశంలో పీఎం మోడీ ఇస్తానన్న 15 లక్షలు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నటు తెలిపారు. మణిపూర్ గురించి పార్లమెంట్ లో మోడీ మాట్లాడడు, ప్రజల పడుతున్న ఇబ్బందుల గురించి మోడీ ఎప్పుడు మాట్లాడడు.. మోడీ కేసీఆర్​ ఇద్దరూ ఒకటే అని తెలిపారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని కి వచ్చిన తర్వాత గమనించింది ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ ఉంది కచ్చితంగా అధికారంలోకి వస్తుంది పరిగిలో రామ్మోహన్ రెడ్డి గెలుస్తారు .

సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి పూర్తి చేశారని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే గారంటీ కార్డును అమలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బ్లాక్ బి అద్యక్షులు పార్థ సారధి పంతులు, బ్లాక్ బి అధ్యక్షుల భారత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సురేందర్ ముదిరాజ్ అశోక్ నారాయణ జితేందర్ రెడ్డి, దస్తగిరి దస్తగిరి పటేల్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బి మైపాల్, అధికార ప్రతినిధి ఆనంద్, షకీల్ సాబ్, జిల్లా జనరల్ సెక్రెటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాము, జిల్లా అధికార ప్రతినిధి మంచి పల్లి శ్రీనివాస్ రెడ్డి , పరిగి పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఎండి మజీద్, కౌన్సిలర్స్ రియాజ్, నాయకులు మల్లేష్,శ్రీనివాస్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి నాగ వర్ధన్ బ్లాక్, ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యాదయ్య శ్రీనివాస్ చిన్న నరసింహులు టౌరయ నాయాక్ ఘనిబై చిట్యాల రాజు వెంకటేష్ వెంకట రామరెడ్డి నరేష్ మాణిక్యం నరేష్ రియాజ్ కుడుముల యాదయ్య వెంకటేష్ మాణిక్యం షేక్ జమీల్ రాజీవ్ గాంధీ పంచాయతీ జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి , పార్టీ అనుబంధ సంఘాలు, యూత్ పరిగి పరిగి నియోజకవర్గ యువజన అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి జగన్ , మహిళా కాంగ్రెస్ బ్లాక్ పాం ప్రెసిడెంట్ సురేఖ రెడ్డి, పరిగి పట్టణ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, యువజన మహిళ అధ్యక్షురాలు పావని, చౌడాపూర్ మండల అధ్యక్షురాలు సరిత పవర్ , నార్మల్ మదర్ డైరీ డైరెక్టర్ ఫిరంగి వెంకటరామిరెడ్డి, బూత్ ఎన్రోలర్స్, యువ నాయకులు రమేష్, యాదవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,మహమ్మద్, నరేందర్, శ్రీకాంత్ , కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed