- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనగణనతో అసెంబ్లీ స్థానాల పెంపునకు అడుగులు
దిశ, రంగారెడ్డి బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన కు రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో జనగణన ప్రారంభించాలని భావిస్తున్నది. 2026 సంవత్సరంలో పూర్తి నివేదికను కేంద్రానికి సమర్పించనున్నది. దీంతో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం అధికంగా కనిపిస్తుంది. జనగణన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగితే తప్ప అసెంబ్లీ పునర్విభజన ప్రక్రియ జరిగే అవకాశం ఉండదని విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు అవసరమైన సదుపాయాలు, ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం.
దీంతో 2026 వ సంవత్సరంలో కచ్చితంగా అసెంబ్లీ స్థానాల పెంపు ఖాయం అనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రతి పార్లమెంట్‌పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతం భారీగా విస్తరించడంతో పాటు జనాభా సంఖ్య పెరిగిపోయింది. కనుక అర్బన్ప్రాంతాల్లోనే రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం అధికంగా ఉంది. రూరల్ప్రాంతాలు జనాభా సంఖ్య ఆధారంగా నియోజకవర్గ భౌగోళిక స్వరూపం, కొన్ని మండలాలు చేర్పులు, మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది.
జిల్లాల కేంద్రంగానైతే భౌగోళిక స్వరూపం మార్పు..
రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, షాద్‌నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, చేవెళ్లలో షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్మాత్రమే ఉన్నాయి. అదే వికారాబాద్ జిల్లాలో తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో పరిగి నియోజకవర్గంలోని గండీడ్, మహమ్మదాబాద్, కొడంగల్నియోజకవర్గంలో దౌల్తాబాద్, దుద్యాల, కొడంగల్, బొంరాస్ పేట్ మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ మండలాల ప్రాతిపదిక తో పాటు జనాభా సంఖ్య ఆధారంగా పరిశీలన చేస్తే పార్లమెంట్సరిహద్దులు మారిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాల కేంద్రంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొడంగల్, కల్వకుర్తిలోని పలు మండలాలు చేవెళ్ల పార్లమెంట్పరిధిలోకి మారే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ పరిధిలోని అర్బన్ప్రాంతాలు సైతం మరో పార్లమెంట్‌లో కలిసే అవకాశం కనిపిస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల ప్రకారం ప్రతి పార్లమెంట్‌పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయం. జిల్లాల కేంద్రంగా పరిశీలిస్తే నియోజకవర్గాల స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉంది.
శంషాబాద్, మణికొండ నియోజకవర్గ కేంద్రాలు..?
రంగారెడ్డి, వికారాబాద్జిల్లాలు కలిపి చేవెళ్ల పార్లమెంట్సరిహద్దు ఉంది. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలతో కొన్ని నియోజకవర్గాలు మూడు, రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయి. అంతేకాకుండా పార్లమెంట్పరిధితో సంబంధం కూడా లేదు. ఉదాహరణకు కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలుంటే నాలుగు మండలాల చొప్పున నారాయణపేట, వికారాబాద్జిల్లాల పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో 7 మండలాలుంటే రెండు మండలాలు మహబూబ్నగర్జిల్లాకు పోగా, మిగిలిన 5 మండలాలు వికారాబాద్‌లో ఉన్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా.. ఒక మండలం వికారాబాద్జిల్లాకు కేటాయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలుంటే నాలుగు రంగారెడ్డి జిల్లాలో కలిసి ఉన్నాయి. ఈ విధంగా నియోజకవర్గాల భౌగోళిక స్వరూపం కావొచ్చు.. రెవెన్యూ, పోలీసు, తదితర ప్రాంతాల విషయంలో కొంత ఇబ్బందులున్నాయి. ఇవన్నీ సవరించి నియోజకవర్గ ప్రజలకు పరిపాలన అందించేలా ఏర్పడే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కనుక రూరల్ ప్రాంతాల్లో జనాభా సంఖ్య పెద్దగా పెరిగినట్లు కనిపించడం లేదు. కానీ అర్బన్ ప్రాంతాల్లోనే అత్యధికంగా జనాభా రోజురోజుకూ పెరుగుతున్నది.
అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ప్రతి ఏడాది చేసే ఓటర్నమోదు అర్బన్‌లోనే పెరిగిపోతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లున్నారు. రూరల్ నియోజకవర్గాలతో పోలిస్తే అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. దీంతో మహేశ్వరం, షాద్‌నగర్, రాజేంద్రనగర్అసెంబ్లీ పరిధిలోని కొన్ని అర్బన్ ప్రాంతాల కలయికతో శంషాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజవర్గాల్లోని పలు ప్రాంతాలతో కలిపి మణికొండ అసెంబ్లీ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. శంషాబాద్, మణికొండ ప్రాంతాలు రెండు కూడా రాజేంద్రనగర్నియోజకవర్గంలోనే ఉండడం విశేషం.
సగం స్థానాల్లో మహిళలే ప్రాతినిధ్యం..
పెరిగిన అసెంబ్లీ స్థానాలతో పాటు మహిళల ప్రాతినిధ్యం సగానికి పైగా పెరగనున్నది. జనగణన తో మహిళా బిల్లును అమలులోకి తీసుకొస్తే రిజర్వేషన్ల ప్రకారం కచ్చితంగా మహిళల ప్రాతినిధ్యం చట్ట సభల్లో పెరుగుతుంది. దీంతో పురుషుల ఆధిపత్యం తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. నూతన అసెంబ్లీ తో పాటు మహిళా రిజర్వేషన్బిల్లుతో చట్ట సభల్లో ప్రాతినిధ్యం పెరగనున్నది.