పోలీస్ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

by Sumithra |
పోలీస్ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
X

దిశ, ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్ గా ఉన్నాయని, పోలీస్ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తగుచర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కడ్తాల్, ఆమనగల్లులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. కడ్తాల్ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేరాల సంఖ్య తగ్గుతూ వస్తుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో పోలీసులు ప్రజలతో మమేకం అవుతున్నారన్నారు. అనంతరం పోలీసుశాఖ అధికారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు పత్యనాయక్, జడ్పీటీసీ దశరథ్, ఎంపీపీ అనిత, కమ్లి, సీఐ ఉపేందర్, ఎస్సైలు సుందరయ్య, హరీష్, వైస్ఎంపీపీ ఆనంద్, మునిసిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed