ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే

by Aamani |
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి  : షాద్ నగర్ ఎమ్మెల్యే
X

దిశ,కేశంపేట: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి భావంతో సమాజంలో శాంతితో పాటు జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలలో హిందూ ధర్మంపై కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి వారు అవగాహన కలుస్తుండడం పట్ల సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సమితి సభ్యులు ఉమెంతల మహేశ్వర్, శివరాములు,యుగంధర్ రెడ్డి,గంగాపురం ఆశ్రమ అధిపతి నందగిరి స్వామి, కమిటీ సభ్యులు తో పాటు మాజీ జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, నాయకులు కరుణాకర్ రెడ్డి,గిరి యాదవ్,రమేష్, ఆనంద్ కుమార్,శ్రీధర్ రెడ్డి,రాజేందర్ రెడ్డి, రామ్ రెడ్డి,సురేష్ రెడ్డి, పర్వతాలు,నాగేశ్వర్,కోడూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed