- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మొగ్గుచూపుతుందా ?

దిశ, బడంగ్పేట్ : బడంగ్పేట్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం అంశం తెరమీదకు రావడంతో మహేశ్వరం నియోజకవర్గం అంతటా చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్లో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అవిశ్వాస తీర్మానం కోసం చర్చలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, సంఖ్యా బలంలేనప్పటికీ అవిశ్వాసం పెట్టబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాదర్గూల్లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కార్పొటరేటర్లతో కలిసి కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు భేటీ అయినట్లు తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ సోమవారం జరిగే మీడియా సమావేశంలో బీజేపీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏరి కోరి తెచ్చుకుని మేయర్ పీఠంపై కూర్చోబెట్టిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బీఆర్ఎస్ ను వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అవిశ్వాసం పెట్టమని ఎందుకు చెప్పడం లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనా? అని బీజేపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. కార్పొరేషన్‌గా అవతరించిన బడంగ్పేట్లో 32 డివిజన్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 13 స్థానాలను టీఆర్ ఎస్ దక్కించుకుంది. బీజేపీ 10, కాంగ్రెస్ 7, స్థానాలతో సరిపెట్టుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం రంగంలోకి దిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 31 డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేయర్ పారిజాత నర్సింహారెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ముత్యాల కృష్ణను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మేయర్ పీఠం, స్వతంత్ర అభ్యర్థి ఇబ్రాం శేఖర్‌లకు డిప్యూటి మేయర్ పదవిలను కట్టబెట్టారు. అనూహ్య పరిణామాల వద్ద రాజకీయంగా చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలకు ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి టీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకటించి, గత జూలై 2వ తేదీన రాజీనామ చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అవిశ్వాస తీర్మానం అంశం తెరమీదకు వచ్చింది. 32 కార్పొరేటర్ల సీట్లు ఉన్న బడంగ్పేట్లో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 22 సీట్లు తప్పనిసరి. 10 సీట్లు ఉన్న బీజేపీ అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నారని, అవిశ్వాసం పెట్టినా తగిన సంఖ్యా బలం నిరూపించుకోవాల్సివస్తుంది. ఒకవేళ అవిశ్వాసం పెట్టినా ? మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఏవిధంగా ఎదుర్కొనబోతాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగామారింది. మేయర్ పై అధికార పార్టీ బీఆర్ఎస్ అవిశ్వాసం పెడుతుందా? లేదా ? అనేది కూడా వేచి చూడాల్సిందే.