- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో బీభత్సం

దిశ, శంషాబాద్ : లగ్జరీ కార్లతో విచ్చలవిడిగా రెచ్చిపోతూ బీభత్సం సృష్టించి రోడ్లపై స్టంట్లు వేసి వాహనదారులను భయాందోళనకు గురిచేసిన ఘటన శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం అర్ధరాత్రి లగ్జరీకార్లతో కార్ రేసింగ్ వివరిస్తూ రోడ్డుపైనే స్టంట్ లు వేస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తూ బీభత్సం సృష్టించడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వాహనదారులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ట్రాఫిక్,ఆర్జీఐఏ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లేసరికి పోలీసుల సైరన్ విని కార్లతో పరారయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ పై వాళ్లు వేసిన స్టెంట్ల గుర్తులను సేకరించి సీసీ కెమెరాలు పరిశీలించగా సీసీ కెమెరాలలో కార్లతో ఔటర్ రింగ్ రోడ్డుపై చేసిన తతంగమంతా రికార్డు అయింది. ఆ రికార్డింగ్ ఆధారంగా బండి నెంబర్లను గుర్తించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.