శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

by Disha Web Desk 20 |
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్ : విదేశాల నుండి యదేచ్ఛగా గుట్టుచప్పుడు కాకుండా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం దుబాయ్ నుండి (EK-528) ఎమిరేట్స్ విమానంలో ముగ్గురు ప్రయాణికులు హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు ప్రయాణికులపై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ ముగ్గురు ప్రయాణికులు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక ప్రయాణికుడు 4 కిలోల 895 గ్రాముల బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరంగా మార్చి సిల్వర్ కోటింగ్ కొట్టించి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. మరో ప్రయాణికుడు 1 కిలో 400 గ్రాముల బంగారాన్ని 12 బస్ బిస్కెట్ల రూపంలో లగేజ్ బ్యాగులో పెట్టుకొని తరలిస్తుండగా పట్టుకున్నారు. మరో ప్రయాణికుడు కూడా 1 కిలో 400 గ్రాముల బంగారాన్ని 12 బిస్కెట్ల రూపంలో లగేజీ బ్యాగులో పెట్టుకుని తరలిస్తుండగా స్కానింగ్లో కష్టంస్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముగ్గురి ప్రయాణికుల వద్ద 4 కోట్ల విలువచేసే 7 కిలోల 695 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Next Story