శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అద్భుత రికార్డ్.. వరుసగా ఐదవసారి అవార్డ్‌కు ఎంపిక

by Disha Web Desk 19 |
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అద్భుత రికార్డ్.. వరుసగా ఐదవసారి అవార్డ్‌కు ఎంపిక
X

దిశ, శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నేషన్ 2022శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నేషన్ 2022 కార్యక్రమంలో సిల్వర్ పురస్కారాన్ని గెలుచుకుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన సమర్థవంతమైన 'కార్బన్ మేనెజ్మెంట్‌'కు గాను ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోని 15-50 మిలియన్ ప్రయాణికుల ఎంపిపిఏ విభాగంలో ఈ అవార్డును గెలుచుకుంది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2018 నుండి ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా 5వ సారి.. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ పర్యావరణంపై విమానయాన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి ఉత్తమ పర్యావరణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇది అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టే ఆసియా-పసిఫిక్ సభ్యులను గుర్తిస్తుంది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సుస్థిర విమానాశ్రయ కార్యకలాపాల ద్వారా పర్యావరణ పరిరక్షణను తన ప్రధాన నిర్వహణ సూత్రంగా స్వీకరించి ఆ దిశగా పని చేస్తోంది.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మా బిజినెస్‌లో అంతర్భాగంగా ఉంటూ వస్తోంది. విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థలో ఇంధన సంరక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మేం కట్టుబడి ఉన్నాము. అనేక ఏళ్లుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సుస్థిర వనరులు, పర్యావరణ అనుకూల విధానాలు, ఇంధన-సమర్థవంతమైన పరికరాలు, పర్యావరణ అనుకూల సాంకేతికత, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ద్వారా హరిత విధానాలను పాటిస్తోంది. ఈ ప్రయాణంలో మేం సుస్థిర విమాన ఇంధనం కోసం అధ్యయనం కూడా చేస్తున్నాము. ఎసిఐ - ఆసియా పసిఫిక్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ నుంచి ఈ గుర్తింపును పొందడం ఎంతో హర్షదాయకం అన్నారు. ఇది మా పర్యావరణ అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేలా మమ్మల్ని పురిగొల్పుతుంది అన్నారు.


Next Story