ప్రధాన రహదారిపై మురుగు పరుగులు

by Aamani |
ప్రధాన రహదారిపై మురుగు పరుగులు
X

దిశ,మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ సీర్లా హిల్స్ ప్రధాన రహదారిపై మురుగు నీరు వరద లా ప్రవహిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి మీర్ పేట్ కు అల్మాస్ గూడ ఇదే ప్రధాన రహదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లే ప్రధాన రహదారి సైతం డ్రైనేజీ పొంగిపొర్లుతుంటే మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మురుగు నీరు ప్రవహిస్తున్న అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పారిశుద్ధం లోపంతో అనేక రకాల అంటువ్యాధులు వస్తాయని పదేపదే వైద్య అధికారులు అవగాహన కల్పిస్తున్నారు, ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో రోగాల బారిన పడి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు.

కలరా, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నట్లు వైద్యుల రికార్డులు చెబుతున్నాయి. మురుగునీరు రోడ్లపై పారడం వలన దోమలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. దోమలతో డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడుతున్న, అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దుర్వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం మొద్దు నిద్ర పట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. స్థానిక కార్పొరేటర్ ఇంటికి ముందే ఉన్న డ్రైనేజీ పై కార్పొరేటర్ స్పందించకపోవడం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed