పక్షంరోజులుగా స్టడీ మెటీరియల్​ పంపిణీ..

by Disha Web Desk 20 |
పక్షంరోజులుగా స్టడీ మెటీరియల్​ పంపిణీ..
X

దిశ, పరిగి : లక్ష్యం ఎంచుకొని చదివితేనే మన చదువుకు సార్థకత లభిస్తుందని డీసీసీబీ చైర్మన్​ బయ్యని మనోహర్​ రెడ్డి అన్నారు. పరిగి మండలంలోని పరిగి, మాదారం, చిట్యాల గ్రామాల్లో సోమవారం జిల్లా పరిషత్​ హైస్కూల్​ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్​ బుయ్యని మనోహర్​ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నపేద విద్యార్థులను విద్యాపరంగా ​ప్రొత్సహించేందుకే తాను బీఎంఆర్​ తరపున స్టడీ మెటీరియల్​ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ స్టడీ మెటీరియల్​ ను సద్వినియోగం చేసుకొని మండల టాపర్లుగా నిలువాలన్నారు. మండల టాపర్​ లుగా వచ్చిన విద్యార్థులకు బీఎంఆర్ ఫౌండేషన్​ తరపున ప్రొత్సహక బహుమతి అందజేస్తామన్నారు. పరిగి నెంబర్​ వన్​ –1 హైస్కూల్​ డీసీసీబీ చైర్మన్​ బుయ్యని మనోహర్​ రెడ్డి మైక్​ సెంట్​ అందజేస్తానన్నారు.

పాలాది శ్రీనివాస్​ గుప్త జిల్లా పరిషత్​ హైస్కూల్​కు మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మాదారం గ్రామ మాజీ సర్పంచ్​ చిల్కమర్రి వెంకటయ్య ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్​ బుయ్యని మనోహర్​ రెడ్డికి ఘన స్వాగతం పలికి, మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేశారు. విద్యాదానం చేస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని పాఠశాలలు డీసీసీబీ చైర్మన్​ బుయ్యని మనోహర్​ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. సుమారు 15 రోజులపాటు కుల్కచర్ల, పూడూరు, దోమ, గండేడ్​, మహ్మదాబాద్​, పరిగి మండలాల్లోని 60 పాఠశాలల్లో 4 వేల పై చిలుకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్​ పంపిణీ చేశానట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్​ కమతం శ్రీనివాస్​ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోవిందపురం అశోక్​ వర్ధన్​ రెడ్డి, ఎస్పీ బాబయ్య, దోమ రాంచెంద్రయ్య, మాణిక్యం, కనకం మొగులయ్య, ఈశ్వరప్ప, వెంకట్​ రాంరెడ్డి, కుర్వ నరేష్​ ఆయా గ్రామాల పెద్దలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed