అనంతగిరిలో ఆయూష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి..

by Disha Web Desk 20 |
అనంతగిరిలో ఆయూష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి..
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ 50 పడకల ఆసుపత్రి మంజూరైందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఆసుపత్రి 50పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలను సిద్ధం చేశారా..? అని శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సర్భానంద్ సోనోవాల్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రికి జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) కింద 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి అనుమతి మంజూరైందని, దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖలు కలిపి రూ.7.57 కోట్లలో తొలి విడత కింద రూ. 6కోట్లకు విడుదలకు అంగీకారం తెలిపిందని అన్నారు.

దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసిందన్నారు. 2016 -17 లోనే అనంతగిరిలో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ సమాచారాన్ని తీసుకన్న ఆయుష్ శాఖ ఎలాంటి నిధులను విడుదల చేయలేదన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో 50 పడకల ఇంటిగ్రేటేడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమయం విధించలేదన్నారు. నామ్ నిబంధనల మేరకు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రిలో డయాగ్నోసిస్ సదుపాయం, మందులు, తదితర పరికరాలు, ఫర్నీచర్ వంటివి ఉండాలని సర్భానంద్ సోనోవాల్ చెప్పారు.


Next Story

Most Viewed