సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Disha Web Desk 23 |
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ శంషాబాద్ : సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సిరీ ఉమెన్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని వైఎస్ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి. ఈ వేడుకలలో పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది అన్నారు. పేదింటి అమ్మాయిలకు పెళ్లి చేయడానికి కల్యాణ లక్ష్మి పథకం తీసుకువచ్చి పెండ్లికి లక్ష 16 వేల రూపాయలను అందిస్తున్న అన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలకు మహిళలను గౌరవించాలని చెప్పాలని తెలిపారు. బాల్యవివాహాలు అరికట్టడంలో మహిళలు ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరు లింగ వివక్ష చూడకుండా ఆడపిల్ల అయినా మగ పిల్లవాడు అయినా అందర్నీ చదివించాలన్నారు. పోటీ తత్వం తో కూడిన నేటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు మానసిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు ఏ విషయంలోనూ తాము ఎవరికి తక్కువ కాదన్నా నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని మహిళలు కలిగి ఉండాలని అన్నారు. అలాంటప్పుడు సమాజం నుండి కూడా ఆశించిన గౌరవ మర్యాదలు తప్పనిసరి దక్కుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, ఎంపిపి జయమ్మ శ్రీనివాస్,జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ బోగేశ్వర్లు,సిరి ఉమెన్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, చంద్రకళ,కౌన్సిలర్లు జహంగీర్ ఖాన్,అజయ్,మేకల వెంకటేష్,బదృనాయక్, బండి భాగ్యలక్ష్మి,లావణ్య,పుష్పలత,స్రవంతి, నాయకులు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నీరటీ రాజు, మోహన్ రావు,మురళి యాదవ్, నందు,హన్మంతు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed