శంకర్పల్లి ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీ

by Kalyani |
శంకర్పల్లి ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీ
X

దిశ, శంకర్పల్లి : గుర్తు తెలియని దుండగులు బాలాజీ ఎలక్ట్రానిక్స్ దుకాణం షట్టర్ విరగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి గండిపేట్ మెయిన్ రోడ్డు పై బాలాజీ ఎలక్ట్రానిక్స్ దుకాణం షట్టర్ తాళాలు తెల్లవారుజామున 3 గంటల 48 నిమిషాలకు విరగొట్టి షట్టర్ లేపి అందులోకి ప్రవేశించారు. కౌంటర్ తాళాలు విరగొట్టి అందులో ఉన్న లక్ష పదివేల నగదు ఎత్తుకెళ్లారని మిగతా వస్తువులు ఏమీ తీసుకెళ్లలేదని దుకాణం యజమాని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా ప్రతిరోజు మాదిరిగా ఉదయం పూట దుకాణం తెరిచేందుకు రాగా షట్టర్ తాళాలు విరిగిపోయి ఉండటం గమనించి దొంగతనం జరిగిందని నిర్ణయించుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శంకర్పల్లి డిటెక్టివ్ సీఐ నాగరాజు ఎస్సైలు సంతోష్ రెడ్డి సత్యనారాయణ లు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుకాణం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed