అపహరించిన డబ్బు రికవరీ

by Disha Web Desk 15 |
అపహరించిన డబ్బు రికవరీ
X

దిశ, తాండూరు : ఓ రైతు ఖాతా నుంచి మాయమైన డబ్బులను యాలాల సొసైటీ సిబ్బంది రికవరీ చేసి బాధితురాలికి ఆ డబ్బును అందజేశారు. వివరాల్లోకి వెళితే యాలాల మండలం పెర్కంపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ అనే రైతు ఖాతా నుంచి పలుమార్లు డబ్బులు మాయం కావడంతో అనుమానించిన రైతు మల్లమ్మ హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంక్ మేనేజర్ వెంటనే స్పందించి ఈ విషయంపై యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడ ఉన్న సీసీ పుటేజీల

ఆధారంగా శంకర్ అనే వ్యక్తి అనేది గుర్తించిన పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో శంకర్ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాల క్రితం యాలాల మండల కేంద్రంలోని కో ఆపరేటివ్ సొసైటీలో అటెండర్ గా పనిచేసేవాడని వివరించారు. రైతు మల్లమ్మ అనే వ్యక్తి ఏటీఎం కార్డును శంకర్ తన దగ్గర ఉంచుకొని రైతుబంధు, పీఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చే నగదును తాండూరు పట్టణం శాంతి మహాల్ సినిమా థియేటర్ పక్కన ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేశాడని నిర్ధారణ చేసిన పోలీస్ లు నిందితుడి నుంచి రూ. 21,900 నగదును రికవరీ చేసి ఆ నగదును బాధితురాలు మల్లమ్మకు బుధవారం సొసైటీ సిబ్బంది అందజేశారు.


Next Story

Most Viewed